టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు!

Published on Thu, 03/02/2023 - 21:42

ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆసీస్‌ ముందు 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందు ఉంచింది. అద్బుతం జరిగితే తప్ప ఆసీస్‌ విజయాన్ని అడ్డుకోవడం టీమిండియాకు కత్తిమీద సాము లాంటిదే. అయినా సరే ఒకవేళ టీమిండియా 75 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగలిగితే మాత్రం 141 రికార్డు బద్దలవడం ఖాయం. ఎందుకంటే టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప టార్గెట్‌ను నిలబెట్టుకున్న జట్టుగా ఆస్ట్రేలియాకు రికార్డు ఉంది.

1883లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 85 పరుగుల అత్యల్ప టార్గెట్‌ను ఆసీస్‌ కాపాడుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 63 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ డిక్‌ బార్లో ఐదు వికెట్లు తీయగా, టెడ్‌ పీటే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్‌ 101 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఫ్రెడ్రిక్‌ స్పోఫోర్త్‌ ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 122 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్‌ ముందు 85 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్య చేధనలో విఫలమైన ఇంగ్లండ్‌ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

అప్పటి మ్యాచ్‌, ఇవాళ ఇండోర్‌లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక అంశం మాత్రం ఆసక్తిగా మారింది. అది టాస్‌. అప్పటిమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఏంచుకుంది. ఇప్పుడు కూడా టాస్‌ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్‌ ఏంచుకుంది. మరి నిజంగా టీమిండియా 75 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగలిగితే మాత్రం టెస్టు చరిత్రలో ఒక రికార్డులా మిగిలిపోనుంది.

చదవండి: 'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!'

అదే రెండున్నర రోజులు.. సీన్‌ మాత్రం రివర్స్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)