Breaking News

సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..

Published on Mon, 09/29/2025 - 12:16

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో తను ఆడిన మ్యాచ్‌ల ఫీజుల మొత్తాన్ని భారత సైన్యంతో పాటు పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు సూర్య విరాళంగా ఇచ్చాడు.

ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ అనంతరం సూర్య తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఆసియాకప్ టోర్నీలో వచ్చే నా మొత్తం మ్యాచ్ ఫీజును పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన కుటంబాలకు, మన సాయుధ దళాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనలలో ఉంటారు. జై హింద్." అని ఎక్స్‌లో స్కై పేర్కొన్నాడు. 

ఈ ఖండాంతర టోర్నీలో మిస్టర్ 360 మొత్తం 7 మ్యాచ్‌లు ఆడాడు. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 లక్షలు అందుకుంటున్నాడు. ఈ ఏడు మ్యాచ్‌లకు గానూ రూ.28 లక్షలు మ్యాచ్ ఫీజు రూపంలో సూర్యకి దక్కనుంది. అయితే పాకిస్తాన్‌పై లీగ్ మ్యాచ్ విజయాన్ని  సాయుధ దళాలకు అంకితం చేసినందుకు సూర్య మ్యాచ్ ఫీజులో ఐసీసీ 30 శాతం కోత విధించింది.

దీంతో అతడు రూ. 26.80 లక్షలు డొనేట్ చేయనున్నాడు. కాగా ఆదివారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాక్‌ను భారత్ ఓడించింది. టీమిండియా ఆసియాకప్‌ను కైవసం చేసుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. పాక్‌పై గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. 

కాగా టోర్నీ ఆరంభం నుంచే పాకిస్తాన్‌పై భారత్ తమ నిరసనను తెలియజేసింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ టోర్నీ మొత్తంగా పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. ఆఖరికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని కూడా భారత్ తీసుకోలేదు.
చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడ‌ల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్‌.. బీసీసీఐ సీరియ‌స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)