Breaking News

'వారిద్దరూ అద్భుతం.. ఆడకపోతే వరల్డ్‌ కప్‌ను మరిచిపోవడమే'

Published on Mon, 12/01/2025 - 15:15

రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 135)తో కదం తొక్కగా.. రోహిత్  (51 బంతుల్లోనే 57) తనదైన శైలిలో ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 

ఆరంభంలోనే జైశ్వాల్ వికెట్ కోల్పోయిన భారత జట్టుకు వీరిద్దరూ తమ అనుభవంతో భారీ స్కోర్‌ను అందించారు. రో-కో ద్వయం రెండో వికెట్‌కు ఏకంగా 136 పరుగులు జోడించారు. కాగా  ఇప్పటికే టీ20, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్‌, కోహ్లిలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 

దీంతో వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఈ వెట‌ర‌న్ క్రికెట‌ర్లు ఆడుతారా? అప్ప‌టివ‌రకు ఫిట్‌నెస్‌గా ఉంటారా? లాంటి సందేహలు చాలా మంది మాజీ క్రికెట‌ర్లు వ్య‌క్తం చేశారు. తమ భవిష్యత్తుపై విమర్శలు చేస్తున్న వారికి ఈ వెటరన్‌ జోడీ అద్భుత ఇన్నింగ్స్‌లతో సమాధానమిచ్చింది.

ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ  సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్-కోహ్లి జోడీ లేకుండా 2027 వన్డే ప్రపంచకప్‌ను గెలవడం అసాధ్యమని అత‌డు చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు వేరే లెవల్‌లో ఆడుతున్నారు. వీరిద్ద‌రూ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాల్సిందే. రో-కో లేకుండా మ‌నం వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెల‌వ‌లేం. 

కాబ‌ట్టి ఇకపై ప్ర‌పంచ‌క‌ప్‌లో వారిద్దరూ ఆడుతారా? ఫిట్‌నెస్‌గా ఉంటారా? లాంటి ప్రశ్నలు వేయొద్దు. రోహిత్‌-కోహ్లిలు 20 ఓవర్లు పాటు కలిసి బ్యాటింగ్‌ చేస్తే ప్రత్యర్ధి కథ సమాప్తమైనట్లే. రాంచీలో కూడా అదే జరిగింది. వారిద్దరూ తమ సంచలన బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. 

వారు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడీ చాలా కష్టపడుతున్నారు.  కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడుతూ తమ రిథమ్‌ కొనసాగించడం అంత సులువు కాదు. వరల్డ్‌కప్‌లో కూడా వారు కీలకం కానున్నారు" అని శ్రీకాంత్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. 

ఇక తొలి వ‌న్డేలో సౌతాఫ్రికాపై 17 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. 350 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)