Breaking News

విజృంభించిన బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా గెలుపు

Published on Sun, 12/14/2025 - 22:32

ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికాను భారత్‌ 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.

పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకొని సౌతాఫ్రికాను గడగడలాడించింది. అర్షదీప్‌ సింగ్‌ (4-0-13-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-11-2), హర్షిత్‌ రాణా (4-0-34-2), కుల్దీప్‌ యాదవ్‌ (2-0-12-2), హార్దిక్‌ పాండ్యా (3-0-23-1), శివమ్‌ దూబే (3-0-21-1) చెలరేగడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్‌ (61) ఒంటరిపోరాటం చేయడంతో సౌతాఫ్రికా కనీసం మూడంకెల స్కోర్‌నైనా చేయగలిగింది.

మిగతా ఆటగాళ్లలో ఫెరియెరా (20), నోర్జే (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్‌ (1), బ్రెవిస్‌ (2), స్టబ్స్‌ (9), కార్బిన్‌ బాష్‌ (4), జన్సెన్‌ (2), బార్ట్‌మన్‌ (1), ఎంగిడి (2 నాటౌట్‌) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. హెండ్రిక్స్‌ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను భారత్‌ ధాటిగా ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత కాస్త నిదానించింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించి ఔటయ్యాక శుభ్‌మన్‌ గిల్‌ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు), తిలక్‌ వర్మ (34 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఆచితూచి ఆడారు. 

శివమ్‌ దూబే (4 బంతుల్లో 10 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించడంతో భారత్‌ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్‌, బాష్‌కు తలో వికెట్‌ దక్కింది. నాలుగో టీ20 లక్నో వేదికగా డిసెంబర్‌ 17న జరుగనుంది. 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)