Breaking News

పాక్‌పై భారత్‌ ఘన విజయం.. మ్యాచ్‌ మధ్యలో ఆటగాళ్ల గొడవ

Published on Thu, 06/22/2023 - 02:51

బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు భారీ విజయంతో శుభారంభం చేసింది. పాకిస్తాన్‌ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్‌ 4–0 గోల్స్‌ తేడాతో  ఘనవిజయం నమోదు చేసింది. కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి (10వ, 16వ, 74వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్‌’ సాధించగా... మరో గోల్‌ను ఉదాంత సింగ్‌ (81వ ని.లో) అందించాడు.శనివారం తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్‌ ఆడుతుంది.

మ్యాచ్‌ మధ్యలో భారత్‌-పాక్‌ ఆటగాళ్ల గొడవ..
పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత హెడ్‌ కోచ్‌ ఇగోర్‌ స్టిమాక్‌ మొరటుగా వ్యవహరించడంతో ఆయనకు మ్యాచ్‌ రిఫరీ ప్రజ్వల్‌ ఛెత్రి రెడ్‌ కార్డు చూపించి మైదానం బయటకు పంపించారు. భారత జట్టు రెండో గోల్‌ చేసిన తర్వాత పాక్‌ ప్లేయర్‌ అబ్దుల్లా ఇక్బాల్‌ త్రో ఇన్‌ చేయడానికి సిద్ధంకాగా స్టిమాక్‌ అబ్దుల్లా నుంచి బంతిని లాక్కున్నారు.

స్టిమాక్‌ చర్యకు పాక్‌ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. రిఫరీ జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు స్టిమాక్‌కు రెడ్‌ కార్డు ఇచ్చి బయటకు పంపించి మ్యాచ్‌ను కొనసాగించారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో కువైట్‌ జట్టు 3–1తో నేపాల్‌ జట్టును ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో లెబనాన్‌తో    బంగ్లాదేశ్‌; మాల్దీవులుతో భూటాన్‌ తలపడతాయి.   

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)