ఆసియా కప్‌ విజేతగా టీమిండియా.. ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలుపు

Published on Mon, 09/29/2025 - 00:12

ఆసియా కప్‌ 2025 (Asia cup 2025) విజేతగా టీమిండియా (Team India) అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్‌ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై (India vs Pakistan) 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (57), ఫకర్‌ జమాన్‌ (46) రాణించడంతో పాక్‌ తొలుత భారీ స్కోర్‌ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం​ వికెట్‌ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్‌లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.

33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ (4-0-26-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్‌ డౌన్‌ బ్యాటర్‌ సైమ్‌ అయూబ్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ సైతం తడబడింది. అయితే తిలక్‌ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్‌ (24), శివమ్‌ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్‌ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. 

అంతకుముందు భారత్‌ 20 పరుగులకే అభిషేక్‌ శర్మ (5), శుభ్‌మన్‌ గిల్‌ (12), సూర్యకుమార్‌ యాదవ్‌ (1) వికెట్లు కోల్పోయింది. పాక్‌ బౌలర్లలో ఫహీమ్‌ అఫ్రాఫ్‌ 3 వికెట్లు తీయగా.. షాహీన్‌ అఫ్రిది, అబ్రార్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు. ఈ టోర్నీలో భారత్‌ పాక్‌పై గెలవడం ఇది మూడోసారి. అంతకు​ముందు గ్రూప్‌ దశలో, సూపర్‌-4లో కూడా టీమిండియానే విజయం సాధించింది. 
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)