Breaking News

పాకిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా..

Published on Sun, 12/14/2025 - 18:17

అండ‌ర్‌-19  ఆసియాక‌ప్ 2025లో యువ భార‌త జ‌ట్టు జోరు కొన‌సాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 90 ప‌రుగుల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతం చేశారు. 241 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాక్‌ చతికల పడింది.

 భారత బౌలర్ల ధాటి​కి పాక్‌ అండర్‌ 19 జట్టు 41.2 ఓవర్లలో కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. దీపేష్ దేవేంద్రన్, కన్షిక్‌ చౌహన్‌ తలా మూడు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించారు. వీరితో పాటు కిషాన్‌ కుమార్‌ రెండు వికెట్లు సాధించారు. పేసర్‌ దీపేష్‌ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని దెబ్బతీశాడు.

పాక్‌ బ్యాటర్లలో హుజైఫా అహ్సాన్(83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికి అహ్సాన్‌ మాత్రం దూకుడుగా ఆడి భారత్‌పై ఒత్తిడిపెంచాడు. ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ముగ్గురే ముగ్గురు డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ సాధించారు.

అదరగొట్టిన ఆరోన్‌..
ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో  భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌(85) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(5) విఫలమయ్యాడు. పాక్‌ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్‌, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. 
చదవండి: IPL 2026: కేకేఆర్‌ కీలక నిర్ణయం..! కెప్టెన్‌గా అతడే?
 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)