Breaking News

భారత్‌ అజేయంగా...

Published on Sat, 09/20/2025 - 04:00

అబుదాబి: ఆసియా కప్‌ టి20 టోర్నీలో లీగ్‌ దశను భారత్‌ అజేయంగా ముగించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి తమతో తలపడిన చిన్న జట్టు ఒమన్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. బ్యాటర్ల పట్టుదలతో ఒమన్‌ కొంత పోరాడగలిగినా... టీమిండియా ముందు అది సరిపోలేదు. శుక్రవారం జరిగిన ఈ గ్రూప్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 21 పరుగులతో గెలుపొందింది. 

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు సామ్సన్‌ (45 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... అభిషేక్‌ శర్మ (15 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఒమన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసింది. 

ఆమిర్‌ కలీమ్‌ (46 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), హమ్మద్‌ మీర్జా (33 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టోర్నీలో నేటి నుంచి సూపర్‌–4 దశ పోటీలు ప్రారంభం అవుతున్నాయి. తొలి పోరులో శ్రీలంకతో బంగ్లాదేశ్‌ తలపడనుండగా ... ఆదివారం పాకిస్తాన్‌ను భారత్‌ ఎదుర్కొంటుంది.  

రాణించిన అభిషేక్, తిలక్‌... 
శుబ్‌మన్‌ గిల్‌ (5) త్వరగానే వెనుదిరిగినా... అభిషేక్‌ మరోసారి తనదైన రీతిలో దూకుడుగా ఆడుతూ శుభారంభం అందించాడు. షకీల్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను నదీమ్‌ ఓవర్లో మరో మూడు ఫోర్లు బాదాడు. సామ్సన్‌ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో భారత్‌ 60 పరుగులు చేసింది. అయితే రామనంది వేసిన ఓవర్లో ముందు అభిషేక్‌ అవుట్‌ కాగా... రెండు బంతుల తర్వాత దురదృష్టవశాత్తూ హార్దిక్‌ పాండ్యా (1) రనౌటయ్యాడు.

సామ్సన్‌ కొట్టిన షాట్‌కు బంతి బౌలర్‌ చేతికి తాకుతూ స్టంప్స్‌ను పడగొట్టడంతో పాండ్యా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకదశలో నాలుగు బంతుల వ్యవధిలో 2 ఫోర్లు, సిక్స్‌ బాదిన అక్షర్‌ను వెంటనే వెనక్కి పంపడంతో ఒమన్‌సఫలమైంది. శివమ్‌ దూబే (5) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, తన సహజశైలికి భిన్నంగా ఆడిన సామ్సన్‌ 41 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరో వైపు క్రీజ్‌లో ఉన్నంత సేపు తిలక్‌ ధాటిని ప్రదర్శించాడు. అయితే వరుసగా వికెట్లు పడుతూ ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగినా కూడా ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు కెప్టెన్ సూర్యకుమార్‌ మాత్రం చివరి వరకు బ్యాటింగ్‌కు రాలేదు!  

కలీమ్, మీర్జా అర్ధసెంచరీలు... 
భారీ లక్ష్య ఛేదనలో ఒమన్‌కు సరైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు జతీందర్, కలీమ్‌ జాగ్రత్తగా ఆడి తొలి 6 ఓవర్లలో 44 పరుగులు రాబట్టారు. ఎట్టకేలకు తొలి వికెట్‌కు 52 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యం తర్వాత కుల్దీప్‌ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో ఒమన్‌ సఫలమైంది. 

ఈ క్రమంలో 38 బంతుల్లో కలీమ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒమన్‌ బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడారు. కలీమ్‌కు తోడు మీర్జా కూడా ధాటిని ప్రదర్శించాడు. 55 బంతుల్లోనే వీరిద్దరు 93 పరుగులు జత చేయడం విశేషం. 30 బంతుల్లో మీర్జా అర్ధ సెంచరీ సాధించగా... ఆ తర్వాత చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయి ఒత్తిడిలో ఒమన్‌ ఓటమి దిశగా పయనించింది.

1 అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్ దీప్‌ సింగ్‌ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 25 మంది బౌలర్లు 100 వికెట్ల మైలురాయిని దాటారు. ఈ జాబితాలో రషీద్‌ ఖాన్‌ (173 వికెట్లు) ‘టాప్‌’లో ఉన్నాడు.  

స్కోరు వివరాలు: 
భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) శుక్లా (బి) రామనంది 38; గిల్‌ (బి) ఫైసల్‌ 5; సామ్సన్‌ (సి) బిష్త్‌ (బి) ఫైసల్‌ 56; పాండ్యా (రనౌట్‌) 1; అక్షర్‌ (సి) శుక్లా (బి) కలీమ్‌ 26; దూబే (సి) జతీందర్‌ (బి) కలీమ్‌ 5; తిలక్‌ (సి) జిక్రియా (బి) రామనంది 29; హర్షిత్‌ (నాటౌట్‌) 13; అర్ష్ దీప్  (రనౌట్‌) 1; కుల్దీప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–6, 2–72, 3–73, 4–118, 5–130, 6–171, 7–176, 8–179. బౌలింగ్‌: షకీల్‌ 3–0–33–0, ఫైసల్‌ 4–1–23–2, నదీమ్‌ 1–0–19–0, రామనంది 4–0–32–2, శ్రీవాస్తవ 2–0–23–0, జిక్రియా 3–0–23–0, కలీమ్‌ 3–0–31–2. 

ఒమన్‌ ఇన్నింగ్స్‌: జతీందర్‌ (బి) కుల్దీప్‌ 32; కలీమ్‌ (సి) పాండ్యా (బి) హర్షిత్‌ 64; హమ్మద్‌ (సి) (సబ్‌) రింకూ (బి) పాండ్యా 51; జిక్రియా (నాటౌట్‌) 0; శుక్లా (సి) (సబ్‌) రింకూ (బి) అర్ష్ దీప్  1; రామనంది (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–56, 2–149, 3–154, 4–155. బౌలింగ్‌: పాండ్యా 4–0–26–1, అర్ష్ దీప్  4–0–37–1, హర్షిత్‌ 3–0–25–1, కుల్దీప్‌ 3–0–23–1, అక్షర్‌ 1–0–4–0, దూబే 3–0 –31–0, తిలక్‌ 1–0–8–0, అభిషేక్‌ 1–0–12–0.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)