అభిషేక్ అద‌ర‌హో.. మూడో టీ20లో భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ

Published on Sun, 01/25/2026 - 22:02

గౌహతి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలూండ‌గానే 3-0 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. కివీస్ నిర్ధేశించిన 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా కేవ‌లం 10 ఓవ‌ర్ల‌లోనే ఊదిప‌డేసింది.

ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి విధ్వంసం సృష్టించాడు. బర్సపారా క్రికెట్ స్టేడియంలో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

అతడితో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్‌) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇషాన్‌ కిషన్‌(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28)సైతం దూకుడుగా ఆడాడు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ, ఇష్‌ సోధీ తలా వికెట్‌ సాధించారు.

బుమ్రా మ్యాజిక్‌..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్‌(48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, బిష్ణోయ్  తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్‌ 'ఢీ'
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)