Breaking News

బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. అభిషేక్ నాయ‌ర్‌, దిలీప్‌ల‌పై వేటు!?

Published on Thu, 04/17/2025 - 10:44

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్‌ జట్టు కోచింగ్ స్టాప్‌లో మార్పులు జ‌ర‌గ‌నున్నాయా? అంటే అవుననే స‌మాధాన‌మే ఎక్కువ‌గా వినిపిస్తోంది. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ స్టాఫ్‌లో భాగ‌మైన అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్ నాయ‌ర్‌, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్ద‌మైన‌ట్లు దైనిక్ జాగరణ్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది.

బ్యాటింగ్‌ కోచ్‌గా ఇప్పటికే సితాన్షు కోటక్‌ ఉండగా అభిషేక్‌ అవసరం లేదన్న భావనలో బోర్డు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భార‌త్ 1-3 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫలమైంది.

ఈ క్ర‌మంలోనే బ్యాటింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ నాయ‌ర్‌కు ఉద్వాస‌న ప‌ల‌కాల‌ని బీసీసీఐ పెద్ద‌లు నిర్ణ‌యించ‌కున్న‌ట్లు దైనిక్ జాగరణ్ తెలిపింది. అదేవిధంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్దానంలో మ‌రో స‌హాయ‌క కోచ్ ర్యాన్ డస్కటే బాధ్య‌త‌లు నిర్వర్తించే అవకాశమున్నట్టు స‌మాచారం. అయితే బీసీసీఐ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎట‌వంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

కాగా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన‌ తర్వాత గౌతమ్ గంభీర్ భారత కొత్త హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నాయర్, ర్యాన్ డస్కటే, మోర్నే మోర్కెల్‌లను స‌పోర్ట్ స్టాప్‌లోకి తీసుకువచ్చాడు. అయితే ఈ కోచింగ్ స్టాప్‌లో ఆధ్వ‌ర్యంలో భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌రుస‌గా ఘోర ప‌రాభావాలు ఎదుర‌య్యాయి. 

స్వ‌దేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్‌, ఆస్ట్రేలియాతో బీజీటీని భార‌త్ కోల్పోయింది. దీంతో  కోచింగ్ స్టాప్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే భార‌త్‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీని సొంతం చేసుకోవ‌డంతో గంభీర్ అండ్ కో కాస్త ఉప‌శ‌మ‌నం పొందారు. కానీ బీసీసీఐ మాత్రం కోచింగ్ స్టాప్‌ను కుదించాల‌ని ప‌ట్టుద‌లతో ఉంది.
చ‌ద‌వండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్‌ వాట్సన్‌ ఫైర్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?