Breaking News

2 నుంచి విశాఖలో భారత్, ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌

Published on Fri, 01/12/2024 - 04:51

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖపట్నంలోని వైఎస్సార్‌ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్, ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన మ్యాచ్‌ నిర్వాహక కమిటీ గురువారం స్టేడియంలో సమావేశమైంది. ఈ వివరాలను కమిటీ చైర్మన్, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మీడియాకు వెల్లడించారు. మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్‌ సదుపాయాలు, ఆహారం కోసం స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

అభిమానుల కోసం రవాణా సదుపాయాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపినాథరెడ్డి మాట్లాడుతూ.. టెస్ట్‌ మ్యాచ్‌ టికెట్లను ఈనెల 15 నుంచి పేటీఎం యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తామని చెప్పారు. ఈసారి పూర్తిగా డిజిటల్‌ టికెట్లను అందించనున్నట్లు తెలిపారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతి రోజుకు విడివిడిగా విక్రయిస్తామని.. అలాగే ఐదు రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్‌ ధరలను రూ.400, 800, 1,000, 1,500గా నిర్ణయించామన్నారు. వైఎస్సార్, స్వర్ణభారతి స్టేడియాల్లో 26 కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)