Breaking News

భారత్, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌ ‘డ్రా’

Published on Fri, 09/05/2025 - 07:45

హిసర్‌ (తజికిస్తాన్‌): అందివచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్న భారత ఫుట్‌బాల్‌ జట్టు అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించుకుంది. సీఏఎఫ్‌ఏ నేషన్స్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోరీ్నలో గురువారం భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఒక్క గోల్‌ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయ్యింది. ‘ఫిఫా’ ర్యాంకుల్లో 127వ స్థానంలో ఉన్న భారత్‌ తమకన్నా దిగువ ర్యాంకు 160లో ఉన్న అఫ్గానిస్తాన్‌పై ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్‌ మొత్తం మీద బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంలోనూ విఫలమైంది. 

ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌పై చేసిన దాడుల్లోనూ నిరాశపరిచింది. అఫ్గానిస్తాన్‌ మూడుసార్లు భారత్‌ గోల్‌పోస్ట్‌పై గురిపెడితే... భారత్‌ కేవలం రెండుసార్లే గోల్‌ ప్రయత్నాలు చేయగలిగింది. భారత్‌ కన్నా అఫ్గానిస్తాన్‌ రక్షణ శ్రేణి మెరుగ్గా ఆడింది. తాజా ఫలితంలో భారత్‌ గ్రూప్‌ ‘బి’లో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్‌ చేరే అవకాశాల్ని కోల్పోయిన భారత్‌ ఇప్పుడు మూడు, నాలుగో స్థానాల కోసం ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతుంది. ఈ నెల 8న ఈ కాంస్య పతకపోరు జరుగుతుంది.  

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)