Breaking News

భారత్, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌ ‘డ్రా’ 

Published on Sat, 03/23/2024 - 01:15

అబా (సౌదీ అరేబియా): ‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌లో బలహీన ప్రత్యర్థిపై గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ పేలవ ఆటతీరు కనబర్చి ‘డ్రా’గా ముగించింది. గ్రూప్‌ ‘ఎ’లో భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య గురువారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌... ఒక్క గోల్‌ అయినా నమోదు కాకుండా ‘డ్రా’ అయ్యింది.

తొలి అర్ధ భాగంలో మన్‌వీర్‌ సింగ్‌ రెండు సార్లు గోల్స్‌ చేసేందుకు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ వైపు దూసుకెళ్లాడు. కానీ గోల్‌ మాత్రం చేయలేకపోయాడు. రెండో అర్ధ భాగంలో విక్రమ్‌ ప్రతాప్‌ కూడా గోల్‌ కోసం విఫల యత్నాలు చేశాడు. మళ్లీ ఫినిషింగ్‌ లోపాలతో భారత్‌ ఖాతా తెరవలేకపోయింది.

సులువైన ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌ను ఛేదించలేకపోవడంపై భారత కోచ్‌ ఐగర్‌ స్టిమాక్‌ అసహనం వ్యక్తం చేశారు. తాజా ‘డ్రా’తో భారత్‌ ఈ గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లాడిన భారత్‌ ఖాతాలో 4 పాయింట్లున్నాయి. 3 మ్యాచ్‌ల ద్వారా 9 పాయింట్లు సాధించిన ఖతర్‌ అగ్ర స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో ఖతర్‌ 3–0తో కువైట్‌పై గెలుపొందింది.  

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)