Breaking News

భారత్‌ 181 ఆలౌట్‌.. విండీస్‌ విజయం 

Published on Sun, 07/30/2023 - 02:37

బ్రిడ్జ్‌టౌన్‌:  కరీబియన్‌లో భారత జట్టు ప్రపంచకప్‌ సన్నాహం పేలవంగా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆశావహులే కాదు... కచ్చితంగా పరిశీలనలో ఉన్న క్రికెటర్లు కూడా నిరాశపరిచారు.  బార్బోడస్‌ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.  మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది.

ఇషాన్‌ కిషన్‌ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, శుబ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించాడు. రొమారియో షెఫర్డ్‌ (3/37), గుడకేశ్‌ మోతీ (3/36), అల్జారి జోసెఫ్‌ (2/35) కలిసికట్టుగా భారత్‌ను కట్టడిచే శారు. కుర్రాళ్లను పరీక్షించడం కోసం స్టార్‌ బ్యాటర్‌ కోహ్లి, కెప్టెన్‌ రోహిత్‌ శర్మలకు రెండో వన్డేలో విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్‌ పాండ్యా ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించాడు.

ఆ ఇద్దరి స్థానాల్లో సంజూ సామ్సన్, అక్షర్‌ పటేల్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్లు మినహా...
టాస్‌ నెగ్గిన విండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగానే... భారత బ్యాటింగ్‌ లైనప్‌ చూసుకొని సగటు క్రికెట్‌ అభిమాని గర్వం! ఇక మనవాళ్లు కుమ్మెస్తారనే గంపెడాశలు! కానీ 50 ఓవర్ల పాటు కూడా కరీబియన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోవడమే పెద్ద షాక్‌. ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసిన ఇషాన్‌ కిషన్‌ గానీ, శుబ్‌మన్‌ గిల్‌ గానీ చెప్పుకోదగ్గ మెరుపులే మెరిపించలేదు. అయితే భారత ఇన్నింగ్స్‌లో వీళ్లిద్దరే కుదురుగా ఆడారు. దీంతో జోరు లేకపోయినా స్కోరు బోర్డు మందకొడిగా సాగింది.

అడపాదడపా బౌండరీలే తప్ప అలరించే సిక్సర్లు కరువయ్యాయి. గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఇషాన్‌ కొట్టిన ఏకైక సిక్సరే ఇన్నింగ్స్‌కు బంగారమైంది! ఆ తర్వాత హార్డ్‌ హిట్టర్లు సూర్యకుమార్, హార్దిక్‌ పాండ్యాల వల్ల కూడా ఒక్క సిక్సర్‌ అయినా నమోదు కాలేదు. 17వ ఓవర్లో ఇషాన్‌ ఇషాన్‌ ఫిఫ్టీ 51 బంతుల్లో పూర్తికాగానే... అదే ఓవర్లో శుబ్‌మన్‌  నిష్క్రమించాడు. దీంతో 90 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లో ఇషాన్‌ ఆటకు షెఫర్డ్‌ చెక్‌ పెట్టాడు.

వీళ్లిద్దరు ఉన్నంతసేపే పరుగులొచ్చాయి. ఆ తర్వాత వికెట్లే రాలాయి. అక్షర్‌ పటేల్‌ (1)ను నాలుగో స్థానంలో ప్రమోషన్‌గా దింపితే తీవ్రంగా నిరాశ పరిచాడు. 97 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో ఆదుకుంటాడనుకున్న పాండ్యా (7) కూడా ప్రత్యర్థి బౌలింగ్‌కు తలవంచాడు.

సూర్యకుమార్‌ (25 బంతుల్లో 24; 3 ఫోర్లు) మెరిపించలేకపోయినా కాసేపు కుదురుగా ఆడాడు. జడేజా (10), శార్దుల్‌ (16; 2 ఫోర్లు) ఇలా అందరు వచ్చిన దార్లోనే పెవిలియన్‌ చేరడంతో మొదటి 90 పరుగుల వరకు వికెట్‌ కోల్పోని భారత్‌... తర్వాతి 91 పరుగులకే అన్ని వికెట్లు (10) కోల్పోయి సుమారు పది ఓవర్ల ముందే ఆలౌటైంది. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) అతనెజ్‌ (బి) షెఫర్డ్‌ 55; గిల్‌ (సి) జోసెఫ్‌ (బి) మోతీ 34; సామ్సన్‌ (సి) కింగ్‌ (బి) కరియ 9; అక్షర్‌ (సి) హోప్‌ (బి) షెఫర్డ్‌ 1; పాండ్యా (సి) కింగ్‌ (బి) సీల్స్‌ 7; సూర్యకుమార్‌ (సి) అతనెజ్‌ (బి) మోతీ 24; జడేజా (సి) కరియ (బి) షెఫర్డ్‌ 10; శార్దుల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జోసెఫ్‌ 16; కుల్దీప్‌ నాటౌట్‌ 8; ఉమ్రాన్‌ (సి) కార్టీ (బి) జోసెఫ్‌ 0; ముకేశ్‌ (సి) హెట్‌మైర్‌ (బి) మోతీ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (40.5 ఓవర్లలో ఆలౌట్‌) 181. వికెట్ల పతనం: 1–90, 2–95, 3–97, 4–113, 5–113, 6–146, 7–148, 8–167, 9–167, 10–181. బౌలింగ్‌: మేయర్స్‌ 5–0–18–0, సీలెస్‌ 6–0–28–1, జోసెఫ్‌ 7–0–35–2, గుడకేశ్‌ మోతీ 9.5–0– 36–3, షెఫర్డ్‌ 8–1–37–3, కరియ 5–0–25–1.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)