Breaking News

T20I: టీమిండియా ఘన విజయం.. ఇలా ఇది మూడోసారి

Published on Wed, 07/10/2024 - 09:27

India Women vs South Africa Women, 3rd T20I: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. 

చెన్నై వేదికగా మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా.. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది.

తొలి టీ20లో దక్షిణాఫ్రికా నెగ్గగా... రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఇక 2006 నుంచి ఇప్పటి వరకు 187 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టుకిది 100వ విజయం కావడం విశేషం. ప్రత్యర్థి జట్టుపై టీమిండియా 10 వికెట్లతో నెగ్గడం ఇది మూడోసారి.

ఈ మ్యాచ్ ‌కంటే ముందు భారత జట్టు 2016లో  ఆస్ట్రేలియాపై, 2019లో వెస్టిండీస్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచింది.  సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది.

పూజ వస్త్రకర్‌కు 4 వికెట్లు
భారత పేస్‌ బౌలర్‌ పూజా వస్త్రకర్‌ 13 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్‌ రాధా యాదవ్‌ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ ఒక్కో వికెట్‌ తీశారు.

అనంతరం 85 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.5 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 88 పరుగులు చేసి టీమిండియా గెలిచింది. 

 

స్మృతి మంధాన (40 బంతుల్లో 54 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (25 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు) కూడా రాణించింది. పూజా వస్త్రకర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)