Breaking News

స్మృతి సెంచరీ.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ సొంతం

Published on Tue, 10/29/2024 - 20:36

న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్‌ జట్టు ఘన విజయం సాధించింది. వైట్‌ ఫెర్న్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్‌ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.

మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ వుమెన్‌ టీమ్‌ భారత్‌కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్‌ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. 

రాణించిన బ్రూక్‌ హాలీడే
ఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్‌ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్‌ సుజీ బేట్స్‌(4), వన్‌డౌన్‌ బ్యాటర్‌ లారెన్‌ డౌన్‌(1) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ జార్జియా ప్లెమ్మర్‌ 39 రన్స్‌ చేసింది.

దీప్తి శర్మకు మూడు వికెట్లు
కెప్టెన్‌ సోఫీ డివైన్‌(9) నిరాశపరచగా.. ఐదో నంబర్‌ బ్యాటర్‌ బ్రూక్‌ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్‌తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్‌(25), లీ తుహుము(24 నాటౌట్‌) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. 

ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్‌ 232 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్‌, సైమా ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.

సెంచరీతో చెలరేగిన స్మృతి
ఇక వైట్‌ ఫెర్న్స్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్‌కు షాక్‌ తగిలింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (12)ను కివీస్‌ పేసర్‌ హన్నా రోవ్‌ అవుట్‌ చేసింది. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్‌ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. 

గత రెండు మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్‌ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. 

హర్మన్‌ అర్ధ శతకం
ఇక కెప్టెన్‌ హర్మన్‌ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.

ఇక జెమీమా రోడ్రిగ్స్‌ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్‌ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మూడో వన్డే స్కోర్లు
👉న్యూజిలాండ్‌- 232 (49.5)
👉భారత్‌- 236/4 (44.2)
👉ఫలితం- న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్‌ విజయం

చదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్‌ రాణా అరంగేట్రం ఫిక్స్‌!?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)