Breaking News

Ind Vs WI 4th T20: టీమిండియాకు గుడ్‌న్యూస్‌! కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు!

Published on Thu, 08/04/2022 - 11:00

India Vs West Indies T20 Series: టీమిండియా అభిమానులకు శుభవార్త! కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా విండీస్‌తో మూడో టీ20 సందర్భంగా రోహిత్‌ శర్మ.. వెన్నునొప్పి కారణంగా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. 

అల్జారీ జోసెఫ్‌ బౌలింగ్‌లో లెగ్‌ సైడ్‌ స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన హిట్‌మ్యాన్‌కు వీపు కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో రోహిత్‌ క్రీజును వీడాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెన్నునొప్పి కారణంగా బాధపడుతున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆఖరి రెండు టీ20 మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడా లేదోనన్న విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.

కాగా మంగళవారం నాటి మ్యాచ్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. నాలుగో టీ20కి సమయం ఉన్నందున అప్పటి పరిస్థితిని బట్టి తాను మైదానంలో దిగుతానో లేదోనన్న విషయం తెలుస్తుందని పేర్కొన్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం హిట్‌మ్యాన్‌ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రిక్‌బజ్‌.. ‘‘శని, ఆదివారాల్లో జరిగే ఆఖరి రెండు మ్యాచ్‌లకు రోహిత్‌ అందుబాటులో ఉండనున్నాడు’’ అని తన కథనంలో పేర్కొంది. 

వీసా సమస్య తొలగింది!
ఇక అమెరికాలోని ఫ్లోరిడాలో టీమిండియా- వెస్టిండీస్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి రెండు టీ20లు జరుగనున్నాయి. అయితే, ఇరు జట్ల ఆటగాళ్లు అమెరికాకు చేరే క్రమంలో వీసా సమస్యలు ఎదురుకాగా.. గయానా అధ్యక్షుడు చొరవ తీసుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం విండీస్‌, భారత్‌ ఆటగాళ్లు ఫ్లోరిడా చేరుకోనున్నట్లు సమాచారం.

కాగా శని(ఆగష్టు 6), ఆది(ఆగష్టు 7) వారాల్లో నాలుగో, ఐదో టీ20 జరుగనున్నాయి. ఇక వెస్టిండీస్‌ వేదికగా సాగిన వన్డే సిరీస్‌లో ధావన్‌ సేన 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్‌ బృందం ఫ్లోరిడా మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
చదవండి: SA vs IRE T20: ప్రొటిస్‌కు చుక్కలు చూపించిన ఐర్లాండ్‌... ఓడినా ఆకట్టుకుంది

Videos

Miss World Contestants: ఇండియాకు రావటం అదృష్టంగా భావిస్తున్నా

రామప్ప ఆలయంలో ప్రపంచ సుందరీమణులు

Nandini Gupta: తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే..

భారత్ కు పాకిస్థాన్ లేఖ

పథకాలు అమలు చేస్తున్న కానీ కాంగ్రెస్‌కి ప్రజల్లో వ్యతిరేకత

కెనడా విదేశాంగశాఖ మంత్రిగా అనితా ఆనంద్...

Chandrasekhar Reddy: విద్యా వ్యవస్థకు చంద్రగ్రహణం.. చంద్రబాబుపై ఫైర్

Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు

జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు

బలూచ్ గడ్డపై జెండా పాతిన తొలి హిందూ యువతి

Photos

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)