Breaking News

IND VS WI 1st ODI: భారీ రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్‌, కోహ్లి

Published on Wed, 07/26/2023 - 12:09

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రెండు భారీ రికార్డులపై కన్నేశారు. హిట్‌మ్యాన్‌ మరో 175 పరుగులు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకోనుండగా.. విరాట్‌ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13,000 పరుగుల క్లబ్‌లో చేరతాడు.

బార్బడస్‌ వేదికగా విండీస్‌తో రేపు (జులై 27) జరుగబోయే తొలి వన్డేలో విరాట్‌, రోహిత్‌లకు ఈ మైలురాళ్లను చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రోహిత్‌ 243 వన్డేల్లో 30 సెంచరీలు, 48 హాఫ్‌ సెంచరీల సాయంతో 9825 పరుగులు చేయగా.. కోహ్లి 274 వన్డేల్లో 46 సెంచరీ, 65 హాఫ్‌ సెంచరీల సాయంతో 12898 పరుగులు చేశాడు. 

ఇదిలా ఉంటే, విండీస్‌తో ఇటీవల ముగిసిన 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో సునాయస విజయం సాధంచగా.. ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌ ఆఖరి రోజు మరో 8 వికెట్లు తీసి ఉంటే భారత్‌ విజయం సాధించేదే.

అయితే ఎడతెరిపి లేని వర్షం టీమిండియా విజయావకాశాలకు భారీ గండికొట్టింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ డ్రాతో సరిపెట్టుకుంది. దీని ప్రభావం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌పై కూడా పడింది. విండీస్‌తో రెండో టెస్ట్‌ గెలిచుంటే భారత్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేది.

విండీస్‌ పర్యటన విషయానికొస్తే.. 27న తొలి వన్డే ఆడే భారత్‌, ఆతర్వాత 29, ఆగస్ట్‌ 1 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఆగస్ట్‌ 3, 6, 8, 12, 13 తేదీల్లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ట్రినిడాడ్‌ వేదికగా జరుగనుండగా.. రెండు, మూడు మ్యాచ్‌లు గయానాలో.. చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. అనంతరం టీమిండియా ఫ్లోరిడా నుంచి నేరుగా ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్తుంది. అక్కడ భారత్‌ 3 టీ20లు ఆడుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)