amp pages | Sakshi

టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా..! టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో..

Published on Mon, 08/08/2022 - 17:32

India vs West Indies T20 Series: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో టీమిండియాకు మరోసారి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు హార్దిక్‌ పాండ్యా. నామమాత్రపు ఐదో టీ20కి రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అతడి స్థానంలో సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 88 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

అద్భుత విజయం!
లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ను భారత స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయి దెబ్బకొట్టారు. దీంతో 15.4 ఓవర్లకే పూరన్‌ బృందం చాపచుట్టేసి ఓటమిని ఆహ్వానించింది. అక్షర్‌కు మూడు, కుల్దీప్‌నకు మూడు, బిష్ణోయికి నాలుగు వికెట్లు దక్కాయి.

మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చిన అక్షర్‌ పటేల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఫ్లోరిడా వేదికగా సాగిన ఈ ఆఖరి మ్యాచ్‌లో విజయంతో భారత జట్టు 4-1తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

కచ్చితంగా చేస్తాను!
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా ఉండే అవకాశం వస్తే బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న అతడికి ఎదురైంది. ఇందుకు బదులుగా హార్దిక్‌.. ‘‘కచ్చితంగా! ఎందుకు సిద్ధంగా ఉండను? ఒకవేళ భవిష్యత్తులో నాకు ఈ అవకాశం వస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు.

అయితే, ఇప్పుడు మా దృష్టి మొత్తం ప్రపంచకప్‌ మీదే ఉంది. అంతకంటే ముందు ఆసియా కప్‌ ఆడాల్సి ఉంది. జట్టుగా సమిష్టిగా ముందుకు సాగుతూ శాయశక్తులు ఒడ్డుతున్నాం. నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నాం. విజయాలను ఆస్వాదిస్తున్నాం. అదే సమయంలో తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం.

నా వరకైతే మేము టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి వందకు వంద శాతం సిద్ధంగా ఉన్నామనే అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్సీ చేసిన హార్దిక్‌ పాండ్యా అద్భుత విజయం అందుకున్న విష‍యం తెలిసిందే. అంతకుముందు ఐపీఎల్‌-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు టైటిల్‌ అందించి సారథిగా సత్తా చాటాడు. 
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్‌! హుడా వైపే మొగ్గు!

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)