Breaking News

రెండో రోజు ముగిసిన ఆట.. జడేజా స్పిన్‌ మ్యాజిక్‌

Published on Sat, 10/11/2025 - 17:43

ఢిల్లీ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న సెకెండ్ టెస్టులో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. రెండో రోజు ఆట‌లో భార‌త్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో అద‌రగొట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది.

భారత బ్యాటర్లలో  యశస్వి జైశ్వాల్ (177) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(129) శతక్కొట్టాడు. వీరిద్దరితో పాటు  ధ్రువ్ జురెల్ (44), నితీశ్ రెడ్డి (43), సాయిసుదర్శన్‌(87) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు తీయగా కెప్టెన్ రోస్టన్‌ ఛేజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

జడేజా మ్యాజిక్‌..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కరేబియన్ జట్టు  4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ ఇంకా భారత్ కం‍టే 378 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో టెవిన్ ఇమ్లాచ్(14), షాయ్ హోప్‌(31) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.
చదవండి: IND vs WI: శుబ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్‌మ‌న్ రికార్డు బ్రేక్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)