Breaking News

150 పరుగులు పూర్తి చేసిన యశస్వి.. తొలి భారత క్రికెటర్‌గా..!

Published on Fri, 07/14/2023 - 20:10

విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పూర్తి ఆధిక్యం దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ యశస్వి 150 పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలో అతను టెస్ట్‌ డెబ్యూలో 150 పరుగుల మార్కును అందుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా, అతి చిన్న వయసులో ఈ ఫీట్‌ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్‌ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును దాటగా.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా పాక్‌ మాజీ క్రికెటర్‌ జావిద్‌ మియాందాద్‌ కొనసాగుతున్నాడు.

మియాందాద్‌.. 19 ఏళ్ల 119 రోజుల వయసులో తన తొలి టెస్ట్‌లో 150 పరుగుల మార్కును దాటాడు. అతని తర్వాత ఆసీస్‌ ఆర్కీ జాక్సన్‌ (19 ఏళ్ల 149 రోజులు), ఆసీస్‌ డౌగ్‌ వాల్టర్స్‌ (19 ఏళ్ల 354 రోజులు), జార్జ్‌ హెడ్లీ (20 ఏళ్ల 226 రోజులు) వరుసలో ఉన్నారు. వీరి తర్వాత అత్యంత పిన్న వయసులో 150 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా యశస్వి రికార్డుల్లోకెక్కాడు. 

ఇదిలా ఉంటే, మూడో రోజు ఆట ప్రారంభం కాగానే జేసన్‌ హోల్డర్‌ వేసిన మూడో ఓవర్లో బౌండరీ, సింగల్‌ బాది యశస్వి 150 పరుగుల మార్కును అందుకున్నాడు. 359 బంతుల్లో అతను 150 మార్కును దాటాడు. 121 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 330/2గా ఉంది. యశస్వి (156)కి జతగా విరాట్‌ కోహ్లి (41) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్‌ (5/60), జడేజా (3/26) విండీస్‌ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (103) శతక్కొట్టగా.. శుభ్‌మన్‌ గిల్‌ (6) విఫలమయ్యాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)