Breaking News

IND VS WI 1st Test: టీమిండియా స్టార్‌ బౌలర్‌ ముంగిట అత్యంత అరుదైన రికార్డు

Published on Tue, 07/11/2023 - 16:08

విండీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. డొమినిక వేదికగా రేపటి నుంచి (జులై 12) ప్రారంభం ​కాబోయే మ్యాచ్‌లో అశ్విన్‌ మరో 3 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా, అంతర్జాతీయ స్థాయిలో 16వ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

అశ్విన్‌కు ముందు భారత స్పిన్నర్లు అనిల్‌ కుంబ్లే (956), హర్భజన్‌ సింగ్‌ (711) మాత్రమే 700 వికెట్ల మైలురాయిని అధిగమించారు. ప్రస్తుతం అశ్విన్‌ ఖాతాలో 270 మ్యాచ్‌ల్లో (92 టెస్ట్‌లు, 113 వన్డేలు, 65 టీ20లు) 697 వికెట్లు (టెస్ట్‌ల్లో 474, వన్డేల్లో 151, టీ20ల్లో 72) ఉన్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో టీమిండియాకు ఇది తొలి టెస్ట్‌ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. గత రెండు దశాబ్దాల రికార్డును చూస్తే విండీస్‌పై టీమిండియాకు స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఈ సిరీస్‌లో రోహిత్‌ సేననే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది.

ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లలో పోలిస్తే విండీస్‌ గడ్డపై అశ్విన్‌కు మెరుగైన రికార్డు ఉంది. కరీబియన్‌ గడ్డపై అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీశాడు. ఇక్కడే కాకుండా ఓవరాల్‌గా చూసినా అశ్విన్‌కు విండీస్‌పై మెరుగైన రికార్డు ఉంది. ఆ జట్టుతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో యాష్‌, 4 సెంచరీల సాయంతో 552 పరుగులు చేసి, 60 వికెట్లు పడగొట్టాడు. విండీస్‌ గడ్డపై ఆడిన 4 మ్యాచ్‌ల్లో అతను 2 సెంచరీల సాయంతో 58.75 సగటున పరుగులు చేసి, 17 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: టీమిండియాకు చుక్కలు చూపించిన బంగ్లా బౌలర్లు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు