IND VS SL 3rd ODI: హిట్‌మ్యాన్‌ మరో రెండు సిక్సర్లు కొడితే..!

Published on Mon, 08/05/2024 - 21:10

శ్రీలంకతో మూడో వన్డేకు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ మరో రెండు సిక్సర్లు కొడితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు​ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్‌ గేల్‌ను (294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్సర్లు) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో 330 సిక్సర్లు (256 ఇన్నింగ్స్‌ల్లో) ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాక్‌ మాజీ షాహిద్‌ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు.

కాగా, లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్‌.. గేల్‌ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్‌.. ఛేదనలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గేల్‌ 177 సిక్సర్లు కొడితే.. రోహిత్‌ 179 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్‌ రెండు మ్యాచ్‌ల్లో రెండు మెరుపు హాఫ్‌ సెంచరీలు చేశాడు.

తొలి వన్డేలో 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసిన రోహిత్‌.. రెండో వన్డేలో 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. రోహిత్‌ రెండు వన్డేల్లో మెరిసినా భారత్‌ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ రోహిత్‌ అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిపాలైంది. సిరీస్‌లో మూడో వన్డే ఆగస్ట్‌ 7న జరుగనుంది.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)