Breaking News

క్రిస్‌ గేల్‌ రికార్డును సమం చేసిన రోహిత్‌

Published on Thu, 08/08/2024 - 15:04

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక​ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, రోహిత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్‌ తర్వాతి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఉన్నాడు. బట్లర్‌ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్‌ గేల్‌ రికార్డును సమం చేశాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 20 బంతుల్లో ఓ సిక్సర్‌, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్‌ ఓ మోస్తరు స్కోర్‌తో రాణించినా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్‌ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్‌ మెండిస్‌ (59), కమిందు మెండిస్‌ (23 నాటౌట్‌) రాణించారు. భారత బౌలర్లలో రియాన్‌ పరాగ్‌ 3, సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన భారత్‌ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్‌ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్‌ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ (35), సుందర్‌ (30), విరాట్‌ కోహ్లి (20), రియాన్ పరాగ్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఈ మ్యాచ్‌లో ఓటమితో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించింది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)