Breaking News

Ind Vs SL: చెలరేగిన భారత బౌలర్లు.. లంక బ్యాటర్లు విలవిల! స్కోరు?

Published on Thu, 01/12/2023 - 16:36

India vs Sri Lanka, 2nd ODI: శ్రీలంకతో రెండో వన్డేలో భారత బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించారు. దీంతో కోల్‌కతాలో పర్యాటక లంక 215 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో మహ్మద్‌ షమీ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించగా.. ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి సిరాజ్‌ అవిష్క ఫెర్నాండోను బౌల్డ్‌ చేశాడు.

దీంతో 29 పరుగుల వద్ద ఓపెనర్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంకను అరంగేట్ర బ్యాటర్‌ నువానీడు ఫెర్నాండో ఆదుకున్నాడు. కుశాల్‌ మెండిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన భారత చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఈ జోడీని విడగొట్టాడు.

పాపం నువానీడు!
17వ ఓవర్‌ చివరి బంతికి మెండిస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇలా 102 పరుగుల వద్ద లంక రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్లోనే అక్షర్‌.. ధనంజయ డిసిల్వను బౌల్డ్‌ చేయగా.. డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నువానీడు అక్షర్‌ బౌలింగ్‌లో అసలంక తప్పిదం కారణంగా రనౌట్‌ కావడంతో లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుదేలైంది. 

ఇక తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్‌ దసున్‌ షనక కుల్దీప్‌ బౌలింగ్‌(22.5)లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్‌ అ‍య్యాడు. అసలంకను సైతం కుల్దీపే పెవిలియన్‌కు పంపాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో హసరంగ ఏడో వికెట్‌గా వెనుదిరగగా.. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన కరుణరత్నెను ఉమ్రాన్‌ మాలిక్‌ అవుట్‌ చేశాడు.

అదరగొట్టేశారు
ఆఖర్లో దునిత్‌ వెల్లలగె(32) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతడిని అవుట్‌ చేసిన సిరాజ్‌.. లాహిర్‌ కుమారను కూడా పెవిలియన్‌కు పంపడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిర్ణీత 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌కు మూడు, అక్షర్‌ పటేల్‌కు ఒకటి, పేసర్లు సిరాజ్‌కు మూడు, ఉమ్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

చదవండి: IND vs SL: లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్‌! కానీ పాపం..
క్రికెట్‌ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. సిరీస్‌ బహిష్కరణ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)