Breaking News

Ind Vs SL: తొలి వన్డే.. టాస్‌ గెలిచిన లంక! అర్ష్‌దీప్‌, కుల్దీప్‌నకు నో ఛాన్స్‌

Published on Tue, 01/10/2023 - 13:08

India vs Sri Lanka, 1st ODI: టీమిండియాతో తొలి వన్డేలో శ్రీలంక టాస్‌ గెలిచింది. లంక కెప్టెన్‌ దసున్‌ షనక తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆతిథ్య భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా అసోంలోని గువహటిలో గల బర్సపర వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.  కాగా బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై గతంలో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా గెలుపొందింది.

కాగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడే నిమిత్తం శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని టీమిండియా టీ20 సిరీస్‌లో లంకను 2-1తో ఓడించింది. ఇక వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులోకి వచ్చాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ వన్డే సిరీస్‌లోనూ ఫేవరెట్‌గా ఉండగా.. లంక జట్టులో అందరు ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లో అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు.

ఇషాన్‌ అవుట్‌! అర్ష్‌దీప్‌, కుల్దీప్‌ బెంచ్‌ మీదే..
ఊహించినట్లుగానే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అదే విధంగా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. పేస్‌ విభాగంలో షమీ, సిరాజ్‌, ఉమ్రాన్‌కు ఛాన్స్‌ రాగా.. అర్ష్‌దీప్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

మరోవైపు.. స్పిన్నర్లలో కుల్దీప్‌నకు మొండిచేయి ఎదురైంది. సీనియర్‌ యజ్వేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌ తొలి వన్డే ఆడనున్నారు. ఇదిలా ఉంటే.. లంక తరఫున దిల్షాన్‌ మధుషంక వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.

తుది జట్లు
భారత్‌: 
రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్‌), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.

చదవండి: Rohit Sharma: ఎందుకు ఏడుస్తున్నావు? నీ బూరె బుగ్గలు భలే బాగున్నాయి! వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)