Breaking News

టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?

Published on Tue, 11/25/2025 - 15:22

గువాహటి వేదికగా భారత్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. ఆతిథ్య జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్‌ చేసి సత్తా చాటారు.

తొలి ఇన్నింగ్స్‌లో..
ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌ను ఫాలో ఆన్‌ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్‌నైట్‌ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.

టార్గెట్‌ ఎంతంటే?
తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది సౌతాఫ్రికా. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (94) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు.. టోనీ డి జోర్జి 49 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వియాన్‌ ముల్డర్‌ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది.  కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.

మరి టెస్టుల్లో భారత్‌ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్‌-5 జాబితా)
🏏1976లో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 403.. భారత్‌ విజయం (406/4)
🏏2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 387.. భారత్‌ విజయం (387/4)
🏏2021లో బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టార్గెట్‌ 328.. భారత్‌ విజయం (329/7)
🏏2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్‌ 276.. భారత్‌ విజయం (276/5)
🏏2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టార్గెట్‌ 264.. భారత్‌ విజయం (264/5).

చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)