అదే మా కొంపముంచింది.. మార్క్రమ్‌ బ్యాటింగ్‌ తీరు అత్యద్భుతం: సౌతాఫ్రికా కెప్టెన్‌

Published on Thu, 01/04/2024 - 20:10

కేప్‌టౌన్‌ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేసర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసినప్పటికీ.. అంతిమంగా భారత పేసర్లదే పైచేయిగా నిలిచింది. సిరాజ్‌ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత భారత్‌ను 153 పరుగులకే పరిమితం చేసి తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది.

అనంతరం మార్క్రమ్‌ కఠినమైన పిచ్‌పై నమ్మశక్యంకాని రీతిలో బ్యాటింగ్‌ విన్యాసాలు ప్రదర్శించి టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే మరపురాని ఇన్నింగ్స్‌ (106) ఆడాడు. మార్క్రమ్‌ రెచ్చిపోతుండటంతో ఓ సమయంలో సౌతాఫ్రికా మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపించింది. అయితే బుమ్రా (6/60) మరో ఎండ్‌లో ఎవరినీ కుదురుకోనీయకపోవడంతో సౌతాఫ్రికా సెకెండ్‌ ఇన్నింగ్స్‌కు 176 పరుగుల వద్ద తెర పడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని (79) ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్‌ ఆడుతూపాడుతూ ఛేదించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ముగించింది. 

కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో చావుదెబ్బ (55 పరుగులకు ఆలౌట్‌) తినడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్‌ చిరస్మరణీయ శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చాడు. భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ ఓటమిని జీర్జించుకోవడం కాస్త కఠినమే. 2-0 తేడాతో సిరీస్‌ను గెలిచుంటే బాగుండేది. అయినా పర్లేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం.

మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్‌ ఆధ్యాంతం పేసర్లు బౌలింగ్‌ చేసిన తీరు.. ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు అత్యద్భుతం. ఈ పిచ్‌పై ఫలితం అందరి ఊహలకు విరుద్దంగా వచ్చింది. దురదృష్టవశాత్తూ మేమే బాధితులమయ్యాము. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకోవడంపై స్పందిస్తూ.. రోహిత్‌ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి రోజు తొలి సెషనే మా కొంపముంచిందని ఎల్గర్‌ అన్నాడు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)