Breaking News

IND VS SA 2nd Test Day 1: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Wed, 01/03/2024 - 20:19

కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో  టీమిండియా తమ చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్‌ వద్ద (153) కోల్పోయి అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు  పరుగులేమీ చేయకుండా ఇలా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ తర్వాత 153/4గా ఉన్న భారత్‌ స్కోర్‌ 11 బంతుల తర్వాత 153 ఆలౌట్‌గా మారింది.

భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డ​కౌట్లు కాగా.. రోహిత్‌ శర్మ (39), శుభ్‌మన్‌ గిల్‌ (36), విరాట్‌ కోహ్లి (46) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ కార్డు చూస్తే అన్నీ సున్నాలే దర్శనమిస్తాయి. బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రకారం టీమిండియా ఆటగాళ్ల స్కోర్లు ఇలా (0, 39, 36, 46, 0, 8, 0, 0, 0, 0, 0 నాటౌట్‌) ఉన్నాయి. భారత ఇన్నింగ్స్‌ ఆఖర్లో తొలుత ఎంగిడి (6-1-30-3), ఆతర్వాత రబాడ (11.5-2-38-3) నిప్పులు చెరిగారు. వీరికి నండ్రే బర్గర్‌ తోడయ్యాడు. 

అంతకుముందు భారత పేసర్లు మొహమ్మద్‌ సిరాజ్‌ (9-3-15-6), ముకేశ్‌ కుమార్‌ (2.2-2-0-2), జస్ప్రీత్‌ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్‌ త్రయం ధాటికి సఫారీల ఇన్నింగ్స్‌ లంచ్‌ విరామంలోపే (23.2 ఓవర్లలో) ముగిసింది. సఫారీల ఇన్నింగ్స్‌లో బెడింగ్హమ్‌ (12), వెర్రిన్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

భారత ఇన్నింగ్స్‌లా కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లు కనీసం ఒక్క పరుగైనా చేయగలిగారు. తొలి రోజు ఆటలో ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు 59.3 ఓవర్లలోనే ముగిసాయి. అంటే 60 ఓవర్లలోపే ఇరు జట్లు 20 వికెట్లు కోల్పోయాయి. 

భారత తొలి ఇన్నింగ్స్‌ అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికా 8 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసి జాగ్రత్తగా ఆడుతుంది. డీన్‌ ఎల్గర్‌ 7, మార్క్రమ్‌ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ను ఇంకా 76 పరుగులు వెనకపడి ఉంది. తొలి రోజు ఆటలో ఇంకా 20 ఓవర్ల ఆట మిగిలి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి టెస్ట్‌ గెలిచిన విషయం తెలిసిందే. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)