Breaking News

IND VS SA 2nd T20: రింకూ సింగ్‌ భారీ సిక్సర్‌.. బాక్సులు బద్దలు

Published on Tue, 12/12/2023 - 22:53

సెయింట్‌ జార్జ్స్‌ పార్క్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా యంగ్‌ డైనమైట్‌ రింకూ సింగ్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న రింకూ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మార్క్రమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19 ఓవర్లో ఒక్కసారిగా పేట్రేగిపోయిన రింకూ.. ఆ ఓవర్‌ చివరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి భారత ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. మార్క్రమ్‌ బౌలింగ్‌లో రెండో సిక్సర్‌ ఏకంగా మీడియా బాక్స్‌ అద్దాలను ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో​ నెట్టింట వైరలవుతుంది. 

అనంతరం భారత ఇన్నింగ్స్‌ మరో 3 బంతుల్లో ముగుస్తుందనగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. 19.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్‌ 180/7గా ఉంది. గెరాల్డ్‌ కొయెట్జీ బౌలింగ్‌లో చివరి ఓవర్‌ రెండు, మూడు బంతుల్లో రవీంద్ర జడేజా (19), అర్షదీప్‌ సింగ్‌(0) ఔటయ్యారు. రింకూ సింగ్‌ (68)తో పాటు సిరాజ్‌ క్రీజ్‌లో ఉన్నాడు.

భారత ఇన్నింగ్స్‌లో రింకూతో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (56) విధ్వంసం సృష్టించగా.. శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, అర్షదీప్‌ సింగ్‌ డకౌట్లు అయ్యారు. తిలక్‌ వర్మ (29), రవీంద్ర జడేజా (19) క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)