Breaking News

సౌతాఫ్రికాకు భారీ షాక్‌

Published on Wed, 12/03/2025 - 17:29

రాయ్‌పూర్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సౌతాఫ్రికాకు భారీ షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి. 

ఆ ఓవర్‌లో తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే సంధించిన బర్గర్‌.. రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. బంతిని వేసే క్రమంలో అతడు రెండు సార్లు తన రన్ అప్‌ను కోల్పోయాడు. బర్గర్ ఆసౌకర్యంగా కన్పించాడు. 

వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో బర్గర్ నడిచేం‍దుకు ఇబ్బంది పడినట్లు కన్పించింది. అతడు తిరిగి మైదానంలో రాలేదు. ఓవరాల్‌గా 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.

అయితే టీ20 సిరీస్‌కు ముందు బర్గర్ గాయపడడం సౌతాఫ్రికా టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా జట్టు బయట ఉన్నాడు. టీ20 సిరీస్ డిసెంబర్ 9  నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయానికి బర్గర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.

భారత్ భారీ స్కోర్‌..
ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(102), రుతురాజ్ గైక్వాడ్‌(105) సెంచరీలతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్‌(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీ.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు