IND vs SA ODIs: షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, జట్లు.. పూర్తి వివరాలు

Published on Sat, 11/29/2025 - 21:05

టెస్టు సిరీస్‌ తర్వాత భారత్‌- సౌతాఫ్రికా వన్డేలలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటి వరకు టీమిండియా- సౌతాఫ్రికా వన్డేల్లో ముఖాముఖి 94 మ్యాచ్‌లలో తలపడ్డాయి.

సఫారీలదే పైచేయి
ఇందులో యాభై ఒక్క మ్యాచ్‌లు గెలిచి సౌతాఫ్రికా ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. భారత్‌ కేవలం నలభై గెలిచింది. మూడు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, ఈసారి సొంతగడ్డపై సిరీస్‌ జరగడం టీమిండియాకు సానుకూలంగా పరిణమించింది. టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌ పరాభవానికి.. కనీసం వన్డేలలోనైనా గెలిచి బదులు తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.

గిల్‌ లేకుండానే..
అయితే, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ గాయం వల్ల ఈ సిరీస్‌కు దూరం కావడం వల్ల ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కానీ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వంటి సీనియర్లతో పాటు జట్టులోకి తిరిగి వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ వంటి ఆటగాళ్లు సత్తా చాటితే అతడు లేని ప్రభావం పెద్దగా పడకపోవచ్చు.

ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తలపడిన టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కోల్‌కతా వేదికగా ప్రొటిస్‌ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు.. గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 

దీంతో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా పాతికేళ్ల తర్వాత మరోసారి సౌతాఫ్రికాతో టెస్టుల్లో టీమిండియా ఈ మేరకు ఘోర ఓటమి రుచిచూసింది.  

టీమిండియా వర్సెస్‌ సౌతాఫ్రికా వన్డే సిరీస్‌
షెడ్యూల్‌
👉తొలి వన్డే: నవంబరు 30, ఆదివారం- రాంచి
👉రెండో వన్డే: డిసెంబరు 3, బుధవారం- రాయ్‌పూర్‌
👉మూడో వన్డే: డిసెంబరు 6, శనివారం- విశాఖపట్నం

మ్యాచ్‌ ఆరంభ సమయం
భారత కాలమానం ప్రకారం మూడు వన్డేలు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభమవుతాయి.

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..
స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ టీవీలో ప్రసారాలు.. డిజిటల్‌ మీడియాలో జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్‌, ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌.

భారత్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు 
నండ్రీ బర్గర్‌, క్వింటన్‌ డికాక్‌, తెంబా బవుమా (కెప్టెన్‌), ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌, కార్బిన్‌ బాష్‌, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్‌ బ్రెవిస్‌, లుంగి ఎంగిడి, ర్యాన్‌ రికెల్టన్‌, టోనీ డి జోర్జి, రూబిన్‌ హెర్మాన్‌, కేశవ్‌ మహరాజ్‌, మార్కో యాన్సెన్‌, ఐడెన్‌ మార్క్రమ్‌, ప్రెనేలన్‌ సుబ్రాయేన్‌.

చదవండి: IND vs SA: తుదిజట్టులో అతడు తప్పక ఉంటాడు: కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)