Breaking News

IND vs SA: ప్రసిద్‌ కృష్ణ అరంగేట్రం.. జడేజా అవుట్‌.. తుదిజట్లు ఇవే

Published on Tue, 12/26/2023 - 13:58

టీమిండియాతో తొలి టెస్టులో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సెంచూరియన్‌లో వర్షం కారణంగా టాస్‌ అరంగటకు పైగా ఆలస్యమైంది. ఇక ఈ మ్యాచ్‌తో భారత యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

మరోవైపు.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాలను భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ సందర్భంగా వెల్లడించాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా నాయకత్వంలోని పేస్‌ దళంలో శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌లతో పాటు ప్రసిద్‌కు చోటిచ్చినట్లు వెల్లడించాడు.

కాగా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటను దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో ప్రసిద్‌ కృష్ణకు మార్గం సుగమమైంది. వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చేతుల మీదుగా అతడు టెస్టు క్యాప్‌ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ గెలవలేదు.

సౌతాఫ్రికా- టీమిండియా తొలి టెస్టు.. తుదిజట్లు ఇవే:
టీమిండియా

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ.

సౌతాఫ్రికా
డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నాండ్రే బర్గర్.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)