Breaking News

T20 WC: నాకూ ఆడాలనే ఉంది.. టీ20 కెరీర్‌పై రోహిత్‌ శర్మ క్లారిటీ!

Published on Tue, 12/26/2023 - 08:36

Ind vs SA 1st Test Rohit Sharma Comments: సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుస్తామనే నమ్మకం ఉందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో ప్రతి ఒక్కరు కఠిన శ్రమకోరుస్తూ తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. కాగా భారత జట్టుకు సఫారీ దేశంలో టెస్టు సిరీస్‌ విజయం అందని ద్రాక్షగానే ఉంది. అయితే, ఈసారైనా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాం
కాగా బాక్సింగ్‌ డే నుంచి సౌతాఫ్రికా- భారత్‌ మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు. ‘‘నా దృష్టిలో ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో ఏ భారత జట్టూ సాధించని ఘనతను అందుకునేందుకు ఇదో మంచి అవకాశం. గతంలో రెండుసార్లు సిరీస్‌ గెలిచేందుకు చేరువగా వచ్చినా సాధ్యం కాలేదు. ఈసారి కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇక్కడ అడుగు పెట్టాం.

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమిని ఈ టెస్టు సిరీస్‌కు ముడి పెట్టలేం. అయితే ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఏదో ఒకటి దక్కాలి. షమీ లేకపోవడం లోటే కానీ కొత్త బౌలర్‌కు ఇది మంచి అవకాశం. మ్యాచ్‌కు ముందే మూడో పేసర్‌పై నిర్ణయం తీసుకుంటాం. కీపర్‌గా రాహుల్‌ రాణిస్తాడనే నమ్ముతున్నాం. అతను ఈసారి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు’’ అని రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

త్వరలోనే మీకు సమాధానం లభిస్తుంది
ఇక ఈ సందర్భంగా తన టీ20 భవిష్యత్తు గురించి స్పందిస్తూ.. ‘‘నాకు ఆడేందుకు అవకాశం ఉన్న అన్ని చోట్లా క్రికెట్‌ ఆడుతూనే ఉంటాం. అందరికీ ఆడాలనే ఉంటుంది. (మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు). నా టి20 భవిష్యత్తు గురించి త్వరలోనే మీకు సమాధానం లభిస్తుంది’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్‌-2022 ముగిసిన తర్వాత హిట్‌మ్యాన్‌ ఇంత వరకు ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేదన్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లోనైనా అతడి మెరుపులు చూసే అవకాశం వస్తుందని అభిమానులు భావిస్తున్న తరుణంలో ముంబై ఇండియన్స్‌ ఇటీవలే కీలక ప్రకటన చేసింది. ముంబైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మను కాదని.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించింది.

ఈ నేపథ్యంలో రోహిత్‌.. హార్దిక్‌ సారథ్యంలో ఆడతాడా? లేదంటే ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడా అన్న అనుమానాల నడుమ హిట్‌మ్యాన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జూన్‌ 4 నుంచి టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఒకవేళ రోహిత్‌ శర్మ గనుక ఐపీఎల్‌-2024కు దూరమైతే ఇక ప్రపంచకప్‌ ఈవెంట్లోనూ ఆడనట్లే!!

చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికా-భారత్‌ టెస్టు సిరీస్‌.. ఐరెన్‌ లెగ్‌ అంపైర్‌ ఔట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)