Breaking News

సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

Published on Fri, 12/29/2023 - 15:48

సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్‌కు ఈ బాధ మర్చిపోకముందే మరో ఎదురదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత జట్టుకు 10 శాతం జరిమానా (మ్యాచ్‌ ఫీజ్‌లో) విధించబడింది. అలాగే రెండు ముఖ్యమైన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్లను సైతం టీమిండియా కోల్పోయింది.

కనీస ఓవర్ రేట్‌ను మెయింటైన్‌ చేయడంలో విఫలం కావడంతో  టీమిండియాపై ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ చర్యల ప్రభావం టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌పై భారీ ప్రభావం చూపింది. పెనాల్టీకి ముందు భారత్‌ 16 పాయింట్లు మరియు 44.44 పాయింట్ల శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా భారత్‌ ర్యాంక్‌ ఆరో స్థానానికి (38.89) పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో తొలిస్దానంలో ఉండిన టీమిండియా ఒక్కసారిగా భారీగా పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి దిగజారింది. 

మరోవైపు భారత్‌పై అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో (12 పాయింట్లు) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌‌కు చేరుకోగా.. రెండో టెస్ట్‌లోనూ పాక్‌ను మట్టికరిపించడంతో  ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ (50.00) రెండో స్థానంలో.. బంగ్లాదేశ్‌ (50), పాకిస్తాన్‌ (45.83) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. 

ఇదిలా ఉంటే, కేవలం మూడు రోజుల్లో ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించగా.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్‌ గిల్‌ (26) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగాడు. 

టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్‌ (3/50).. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో బర్గర్‌ (4/33), జన్సెన్‌ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్‌ (56), మార్కో జన్సెన్‌ (84 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్‌ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో  బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా రెండో టెస్ట్‌ ప్రారంభంకానుంది.
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)