Breaking News

రోహిత్‌ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్

Published on Sun, 11/30/2025 - 14:56

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్‌ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డే సందర్భంగా రోహిత్‌ శర్మ ఈ ఘనత సాధించాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సొంతగడ్డపై ప్రొటిస్‌ జట్టుతో రాంచి వేదికగా తొలి మ్యాచ్‌లో.. టాస్‌ ఓడిన భారత్‌ మొదట బ్యాటింగ్‌కు దిగింది . ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (18) నిరాశపరచగా.. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నిలకడగా ఆడుతూ వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డాడు.

ఈ క్రమంలో రోహిత్‌కు తోడైన వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు అదరగొట్టడంతో పవర్‌ ప్లేలో (10 ఓవర్లు) భారత్‌ వికెట్‌ నష్టానికి 80 పరుగులు సాధించింది. 

తద్వారా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత వన్డేల్లో తొలి పది ఓవర్లలో మొదటిసారి ఈమేర అత్యధిక స్కోరు సాధించింది. ఇక రోహిత్‌- కోహ్లి స్థాయికి తగ్గట్లు చెలరేగడంతో డ్రింక్స్‌ విరామ సమయానికి (16 ఓవర్లలో) మరో వికెట్‌ నష్టపోకుండా 122 పరుగులు సాధించింది.

రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు
రోహిత్‌ శర్మ 36 బంతుల్లో 45, కోహ్లి 44 బంతుల్లో 45 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక భారత ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో ప్రొటిస్‌ స్పిన్నర్‌ సుబ్రేయన్‌ రంగంలోకి దిగగా.. అతడి బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్లో రోహిత్‌ వరుసగా సిక్సర్లు బాదాడు. 

 

ఈ క్రమంలోనే వన్డేల్లో తన 352వ సిక్సర్‌ను రోహిత్‌ నమోదు చేశాడు. తద్వారా పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ ఆఫ్రిది (351 సిక్సర్లు) పేరిట ఉన్న వన్డే సిక్సర్ల రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. అనంతరం రోహిత్‌ 57(51 బంతుల్లో) పరుగుల వద్ద మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుగదిరిగాడు.

కోహ్లి అర్ద శతకం
మరోవైపు... కోహ్లి అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది కెరీర్‌లో 76వ వన్డే ఫిఫ్టీ సాధించాడు. ఈ క్రమంలోనే 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది.  కాగా 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.

చదవండి: శతక్కొట్టిన అభిషేక్‌ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)