Breaking News

IND vs NZ: కొరకరాని కొయ్య.. శతక్కొట్టిన రచిన్‌ రవీంద్ర

Published on Fri, 10/18/2024 - 11:35

టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ యువ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర శతకంతో మెరిశాడు. భారత బౌలర్లకు కొరకరానికి కొయ్యగా మారి.. వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆద్యంతం అద్భుత బ్యాటింగ్‌తో 124 బంతుల్లోనే సెంచరీ మార్కు దాటేశాడు.

అతడి తర్వాత.. కివీస్‌ తొలి బ్యాటర్‌గా
కాగా టెస్టుల్లో రచిన్‌కు ఇది రెండో శతకం. తన తండ్రి సొంత ఊరైన బెంగళూరులో సెంచరీ సాధించడం అతడి కెరీర్‌లో మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. అంతేకాదు.. రచిన్‌ సాధించిన ఈ శతకానికి మరో ప్రత్యేకత కూడా ఉందండీ! 

న్యూజిలాండ్‌ తరఫున బెంగళూరులో 2012 తర్వాత సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర కావడం విశేషం. నాడు రాస్‌ టేలర్‌ ఇదే వేదికపైన టీమిండియాపై 113 పరుగులు సాధించాడు.

భారీ ఆధిక్యంలో కివీస్‌
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్‌ భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల గురువారం మొదలైంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది.

అయితే, పిచ్‌ను తప్పుగా వేయడం వల్ల భారీ మూల్యం చెల్లించింది. కివీస్‌ బౌలర్ల ధాటికి తాళలేక రోహిత్‌ సేన 46 పరుగులకే ఆలౌట్‌ అయింది. కానీ.. ఇదే వేదికపై న్యూజిలాండ్‌ బ్యాటర్లను మాత్రం కట్టడి చేయలేకపోయింది. గురువారం ఆట ముగిసే సరికి 180/3 స్కోరు చేసిన కివీస్‌.. శుక్రవారం ఆరంభం నుంచి నిలకడగా ఆడింది.

భోజన విరామ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. భారత్‌ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 299 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. లంచ్‌ బ్రేక్‌నకు ముందు రచిన్‌ రవీంద్ర 104,  టిమ్‌ సౌతీ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: టీమిండియా 46 ఆలౌట్‌.. అజింక్య రహానే పోస్ట్‌ వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)