ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి!

Published on Tue, 01/20/2026 - 08:56

న్యూజిలాండ్‌ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్‌కు తొలిసారి భారత్‌  వన్డే సిరీస్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా ఓటమికి కారణం అదే
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్‌ సిరీస్‌ కోల్పోయేందుకు కారణమని గావస్కర్‌ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్‌లు ఎలా నిర్మించాలో విరాట్‌ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు. 

‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్‌లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది. 

రాహుల్‌లాంటి బ్యాటర్‌ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్‌ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్‌ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు. 

ఓటమిని అంగీకరించకుండా
‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్‌ పేర్కొన్నారు.    

చదవండి: భారత్‌ నెత్తిన మిచెల్‌ పిడుగు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)