Breaking News

అభిషేక్‌ శర్మ విధ్వంసకాండ.. 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

Published on Sun, 01/25/2026 - 21:38

గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీని, ఓవరాల్‌గా ఏడో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు.

భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉంది. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ కేవలం 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీగా కొనసాగుతుంది. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు నేపాల్‌ ఆటగాడు దీపేంద్ర సింగ్‌ ఎయిరీ పేరిట ఉంది. దీపేంద్ర 2023 ఏషియన్‌ గేమ్స్‌లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. అభిషేక్‌ విధ్వంసం ధాటికి భారత్‌ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. సంజూ శాంసన్‌ (0), ఇషాన్‌ కిషన్‌ (28) ఔట్‌ కాగా.. అభిషేక్‌ శర్మ (67), సూర్యకుమార్‌ యాదవ్‌ (42) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 66 బంతుల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేయాలి.

అంతకుముందు బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్‌ (4-0-17-3), హార్దిక్‌ పాండ్యా (3-0-23-2), హర్షిత్‌ రాణా (4-0-35-1) ధాటి​కి న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27), డారిల్‌ మిచెల్‌ (14), సీఫర్ట్‌ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్‌ (4), జేమీసన్‌ (3), హెన్రీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)