Breaking News

మిచెల్‌, ఫిలిప్స్‌ సెం‍చరీలు.. భారత్‌ ముందు భారీ టార్గెట్‌

Published on Sun, 01/18/2026 - 17:41

ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. 

మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్‌(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్‌.. విల్ యంగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. యంగ్‌(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్‌, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్‌దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఆఖరిలో బ్రేస్‌వెల్‌(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్  మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సిరాజ్, కుల్దీప్ త‌లా వికెట్ సాధించారు. ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి క‌నీసం ఒక్క వికెట్ కూడా సాధించ‌లేక‌పోయాడు. కాగా డారిల్‌ మిచెల్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.
చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)