Breaking News

న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?

Published on Sun, 01/22/2023 - 15:40

IND VS NZ 3rd ODI: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. జనవరి 24న నామమాత్రంగా జరిగే మూడో వన్డేలో ప్రయోగాల బాట పట్టనుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇండోర్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో షాబాజ్‌ అహ్మద్‌, చహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉం‍ది. తొలి రెండు వన్డేలు ఆడిన కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లకు విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 27 నుంచే ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ (న్యూజిలాండ్‌తో) నేపథ్యంలో చహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లకు ఓ అవకాశం ఇవ్వాలన్నది మేనేజ్‌మెంట్‌ అభిప్రాయమని సమాచారం. చహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఇద్దరూ టీ20 జట్టులో కూడా ఉండటంతో ఈ మార్పులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

పైన పేర్కొన్న మూడు మార్పులు మినహాయించి, రెండో వన్డే ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఓపెనర్లుగా రోహిత్‌, గిల్‌, వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి, ఆతర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్ధిక్‌, షాబాజ్‌ అహ్మద్‌, షమీ, సిరాజ్‌, ఉమ్రాన్‌, చహల్‌ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లో భారత్‌ తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)