WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్‌

Published on Thu, 10/24/2024 - 11:54

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ నాథన్‌ లియోన్‌ పేరిట ఉన్న రికారుర్డు బద్దలు కొట్టాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు.

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అశ్విన్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు కివీస్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక న్యూజిలాండ్‌ టీమిండియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.

తొలుత నాథన్‌ లియోన్‌ రికార్డు సమం చేసి
ఈ క్రమంలో భారత్‌- కివీస్‌ మధ్య పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, కెప్టెన్‌, ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(15)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు రవిచంద్రన్ అశ్విన్‌. కివీస్‌ ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ ఆఖరి బంతికి లాథమ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

 

కాగా డబ్ల్యూటీసీలో అశూకు ఇది 187వ వికెట్‌. తద్వారా డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ రికార్డును సమం చేశాడు. అయితే, కాసేపటికే లియోన్‌ను అధిగమించాడు అశూ. 24వ ఓవర్లో కివీస్‌ మరో వన్‌డౌన్‌ బ్యాటర్‌ విల్‌ యంగ్‌ను అవుట్‌ చేశాడు. 

లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా అవతరించి
ఈ క్రమంలో 188 వికెట్లతో అశ్విన్‌ డబ్ల్యూటీసీ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా అవతరించాడు. ఇక మొదటి రోజు ఆటలో భోజన విరామ సమయానికి న్యూజిలాండ్‌ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 47, రచిన్‌ రవీంద్ర 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

చదవండి: IND Vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియాలో మూడు మార్పులు

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)