Breaking News

భారత్‌తో తొలి టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

Published on Wed, 01/21/2026 - 18:51

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌ జరుగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌తో క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పేసర్లుగా జేమీసన్‌, డఫీ ఉన్నారు.

మరోవైపు భారత్‌ ముందుగా చెప్పినట్లుగానే శ్రేయస్‌ను కాదని వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇచ్చింది. హర్షిత్‌ రాణా, రవి బిష్ణోయ్‌, కుల్దీప్‌ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేసింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక న్యూజిలాండ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

తుది జట్లు..
న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ

భారత్‌: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)