Breaking News

Ind Vs NZ: ధోని రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. అరుదైన ఘనత

Published on Wed, 01/18/2023 - 15:07

India vs New Zealand, 1st ODI- Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా- కివీస్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ బుధవారం ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

ఇక భారత ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌.. మూడో ఓవర్‌లో కివీస్‌ బౌలర్‌ హెన్రీ షిప్లే బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా సిక్సర్‌ బాదాడు. ఈ క్రమంలో ధోని పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్‌ సవరించాడు. ఆ తర్వాత ఐదో ఓవర్‌ నాలుగో బంతికి మరోసారి షిప్లే బౌలిం‍గ్‌లోనే రోహిత్‌ సిక్స్‌ బాదాడు.

ఇదిలా ఉంటే.. కివీస్‌తో తొలి వన్డేలో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ 34 పరుగులు(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. టిక్నర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు
►రోహిత్‌ శర్మ- 125
►ఎంఎస్‌ ధోని- 123
►యువరాజ్‌ సింగ్‌- 71

చదవండి: ఆటో డ్రైవర్‌ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్‌ మాటలు వింటే..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)