Breaking News

IND VS NZ 1st ODI: కోహ్లికి డిమోషన్‌.. కింగ్‌ స్థానంలో గిల్‌..?

Published on Tue, 01/17/2023 - 21:29

హైదరాబాద్‌ వేదకగా న్యూజిలాండ్‌తో రేపు (జనవరి 18) జరుగబోయే తొలి వన్డేలో టీమిండియా ప్రయోగాల బాట పట్టనుందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తుది జట్టులో యువకులకు సముచిత స్థానం దక్కాలంటే, సీనియర్లు కొన్ని త్యాగాలు చేయక తప్పదని టీమిండియా మాజీ ప్లేయర్‌, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ సైతం తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇదే విషయాన్ని పలు విశ్లేషకులు కూడా ప్రస్తావిస్తున్నారు. 

త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో యువకులకు వీలైనన్ని అవకాశాలు కల్పించాలంటే సీనియర్లు తమ బ్యాటింగ్‌ స్థానాలను మార్చుకోక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జట్టులో ఓపెనింగ్‌ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వాలా లేక తన చివరి వన్డేలో డబుల్‌ సెంచరీ బాదిన ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇవ్వాలా అని జట్టు మేనేజ్‌మెంట్‌ తర్జనభర్జన పడుతుంది. 

ఈ పరిస్థితుల్లో కెప్టెన్‌ రోహిత్‌కు జతగా ఇషాన్‌ కిషన్‌ను బరిలోకి దించేం‍దుకు మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రైట్‌ అండ్‌ లెఫ్ట్‌ కాంబినేషన్‌ కావడంతో ఈ జోడీకే యాజమాన్యం ఓటు వేసినట్లు సమాచారం. మరోవైపు సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌కు కూడా అన్యాయం జరగకుండా, కోహ్లిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కు పంపి వన్‌ డౌన్‌లో గిల్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని మేనేజ్‌మెంట్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే కోహ్లి నాలుగో స్థానంలో, సూర్యకుమార్‌ ఐదులో, హార్ధిక్‌ ఆరో స్థానంలో, ఏడో ప్లేస్‌లో సుందర్‌, ఆతర్వాత బౌలర్లు బరిలోకి దిగాల్సి ఉంటుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)