Breaking News

భారత్‌-ఇంగ్లండ్‌ నాలుగో టెస్ట్‌.. స్టార్‌ బ్యాటర్‌ వచ్చేస్తున్నాడు..!

Published on Mon, 02/19/2024 - 14:48

టీమిండియాకు గుడ్‌ న్యూస్‌. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న నాలుగో టెస్ట్‌కు స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అందుబాటులోకి రానున్నాడు. గాయం కారణంగా గత రెండు టెస్ట్‌లకు (రెండు, మూడు) దూరంగా ఉన్న రాహుల్‌ ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉంటూ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని తెలుస్తుంది. మోకాళ్ల సమస్యతో బాధపడుతున్న రాహుల్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉండి పూర్తిగా కోలుకున్నాడని సమాచారం.

ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు రాహుల్‌ అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పరోక్షంగా ప్రస్తావించాడు. రాహుల్‌ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్‌ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. రాహుల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి అందుబాటులోకి వస్తే గత రెండు మ్యాచ్‌ల్లో అతనికి ప్రత్యామ్నాయంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న రజత్‌ పాటిదార్‌పై వేటు పడే అవకాశం ఉంది.

పాటిదార్‌ గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయి ప్రభావం చూపించలేకపోయాడు. విశాఖ టెస్ట్‌లో (32, 9) కాస్త పర్వాలేదనిపించిన పాటిదార్‌.. రాజ్‌కోట్‌ టెస్ట్‌లో (5, 0) పూర్తిగా తేలిపోయాడు. కాగా, రాహుల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో మూడో టెస్ట్‌కు ముందు అతనికి ప్రత్యామ్నాయంగా దేవ్‌దత​ పడిక్కల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో వరుసగా రెండు, మూడు టెస్ట్‌లను గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. నిన్న ముగిసిన మూడో టెస్ట్‌లో భారత్‌ 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు జరిగిన విశాఖ టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో గెలవగా.. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో గట్టెక్కింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్‌ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు జరుగుతుంది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)