Breaking News

IND vs ENG: టీమిండియా ప్రాక్టీస్ షురూ..

Published on Sun, 06/08/2025 - 13:05

భార‌త టెస్టు క్రికెట్‌లో కొత్త శ‌కం మొద‌లైంది. విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శ‌ర్మలు వంటి దిగ్గ‌జాలు లేకుండా తొలి టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ద‌మైంది. శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని యువ భార‌త జ‌ట్టుకు ఇంగ్లండ్ రూపంలో కఠిన స‌వాలు ఎదురుకానుంది.

రోహిత్ వారసుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శుబ్‌మ‌న్ గిల్‌.. జ‌ట్టును ఎలా న‌డిపిస్తాడా అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు వ‌రుస‌గా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌ల‌ను భార‌త్ కోల్పోవ‌డంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైన కూడా తీవ్ర‌మైన ఒత్తిడి ఉంది. ఈ క్ర‌మంలో గిల్‌-గౌతీ కాంబనేష‌న్‌లో భార‌త జ‌ట్టు ఎలా రాణిస్తుందో మ‌రి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

టీమిండియా ప్రాక్టీస్ షూరూ..
ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇప్ప‌టికే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అడుగు పెట్టింది. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు ఆదివారం(జూన్ 8)తొలి ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ గిల్‌ ర‌వీంద్ర జ‌డేజా, అర్ష్‌దీప్‌, సిరాజ్ క‌స‌రత్త‌లు చేస్తున్న‌ట్లు క‌న్పించింది.

కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ కూడా భార‌త జ‌ట్టులో చేరారు. రాజీనామా చేసిన సోహమ్ దేశాయ్ స్ధానంలో అడ్రియన్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఇంగ్లండ్‌-భార‌త్ మ‌ధ్య తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు లీడ్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్
చదవండి: IND vs ENG: వైభ‌వ్ సూర్య‌వంశీ సిక్స‌ర్ల వర్షం..! వీడియో వైర‌ల్‌

 

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)