Breaking News

నా సహోదరుడా.. అంటూ రింకూ సింగ్‌ భావోద్వేగం

Published on Mon, 02/26/2024 - 10:49

India vs England, 4th Test- Rinku Singh's Emotional Post: టీమిండియా యువ క్రికెటర్‌ ధ్రువ్‌ జురెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. దురదృష్టవశాత్తూ సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

అయితేనేం.. అతడు సాధించిన ఆ 90 పరుగులు భారత ఇన్నింగ్స్‌లో అత్యంత ముఖ్యమైనవి. టీమిండియా 307 పరుగులు మార్కును అందుకుందంటే అందుకు జురెలే కారణం. ముఖ్యంగా మూడో రోజు ఆటలో భాగంగా కుల్దీప్‌ యాదవ్‌(28)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 విలువైన పరుగులు జోడించిన తీరు అద్భుతం.

అలా తొలి ఇన్నింగ్స్‌లో 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్‌ జురెల్‌.. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి కష్టాల్లో ఉ‍న్న జట్టును గట్టెక్కించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్‌.. జురెల్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్‌ రాశాడు. 

జురెల్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘‘నా సహోదరుడా... కలలు నిజమయ్యే తరుణం ఇది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రేమను కురిపించాడు. కాగా రింకూ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌ దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ఆడతారన్న విషయం తెలిసిందే. అలా పరిచయమైన వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. 

ఇదిలా ఉంటే.. మాజీ క్రికెటర్లు వసీం జాఫర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ తదితరులు ధ్రువ్‌ జురెల్‌ నైపుణ్యాలను కొనియాడుతూ సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ధ్రువ్‌ జురెల్‌.. రాంచి మ్యాచ్‌లో తాను సాధించిన విలువైన అర్ధ శతకాన్ని తన తండ్రికి అంకితమిచ్చాడు.

మరోవైపు.. దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో అద్బుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న రింకూ సింగ్‌.. గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్లో నయా ఫినిషర్‌గా అవతరించిన ఈ యూపీ బ్యాటర్‌.. వన్డేల్లోనూ తనదైన ముద్ర వేయాలని పట్టుదలగా ఉన్నాడు.

చదవండి: ఏంటి సర్ఫరాజ్‌.. హీరో అవ్వాలనుకుంటున్నావా? రోహిత్‌ సీరియస్‌! 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)