లార్డ్స్‌లో చరిత్ర తిరగరాసిన బెన్‌ డకెట్‌

Published on Sun, 07/19/2026 - 21:30

భారత్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ శతక్కొట్టాడు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ భారీ సెంచరీతో అలరించాడు. ఈ క్రమంలో క్రికెట్‌ పుట్టినిల్లు లార్డ్స్‌ మైదానంలో డకెట్‌ చరిత్ర తిరగరాశాడు. వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ పేరిట ఉన్న 47 ఏళ్ల రికార్డును ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ బద్దలు కొట్టాడు.

141 పరుగులు
లార్డ్స్‌ వేదికగా టీమిండియాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ 135 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో ఏకంగా 141 పరుగులు సాధించాడు. అయితే, ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇవ్వడంతో డకెట్‌ శతక ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.

లార్డ్స్‌లో ప్రపంచ రికార్డు
అయితే, ఈ భారీ శతకం ద్వారా డకెట్‌ లార్డ్స్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. క్రికెట్‌ ‘మక్కా’లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు వివియన్‌ రిచర్డ్స్ పేరిట ఉండేది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..

డకెట్‌ శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్‌ జేకబ్‌ బెతెల్‌ (91) సెంచరీ మిస్‌ అయ్యాడు. ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి బెతెల్‌ అవుటయ్యాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ జో రూట్‌ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. వన్డేల్లో వరుసగా ఆరో అర్ధ శతకం (48 బంతుల్లోనే 74 నాటౌట్‌) బాదాడు.

ఇంగ్లండ్‌ భారీ స్కోరు
కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (14) నిరాశపరచగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 315కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 387 పరుగులు సాధించింది. లార్డ్స్‌లో వన్డేల్లో ఇదే హయ్యస్ట్‌ స్కోరు.

లార్డ్స్‌ మైదానంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు
👉బెన్‌ డకెట్‌ (ఇంగ్లండ్‌)- టీమిండియా మీద 2026లో 141 పరుగులు
👉వివియన్‌ రిచర్డ్స్‌ (వెస్టిండీస్‌)- ఇంగ్లండ్‌ మీద 1979 వరల్డ్‌కప్‌ ఫైనల్లో 138 నాటౌట్‌
👉డెనిస్‌ ఆమిస్‌ (ఇంగ్లండ్‌)- టీమిండియా మీద 1975లో 137 పరుగులు
👉మార్కస్‌ ట్రెస్కోతిక్‌ (ఇంగ్లండ్‌)- పాకిస్తాన్‌ మీద 2001లో 137 పరుగులు
👉గ్రాహమ్‌ గూచ్‌ (ఇంగ్లండ్‌)- ఆస్ట్రేలియా మీద 1989లో 136 పరుగులు.

చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్‌- కోహ్లి

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)