Breaking News

అదెట్లా అవుట్‌.. కానేకాదన్న రోహిత్‌! అంపైర్‌దే తప్పు!

Published on Fri, 03/08/2024 - 15:26

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు..  భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ను ఇంగ్లిష్‌ దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని.. షార్ట్‌ లెంగ్త్‌ బాల్‌గా సంధించాడు. 

ఈ బంతిని ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సరిగ్గానే అంచనా వేసి దానిని మిస్‌ చేశాడు. అయితే, బాల్‌ రోహిత్‌ కుడికాలి ప్యాడ్‌ను రాసుకుంటూ వెళ్లి కీపర్‌కు చిక్కింది. కానీ.. ఇంగ్లండ్‌ మాత్రం క్యాచ్‌ అవుట్‌కు అప్పీలు చేసింది.

అయితే, అనూహ్యంగా అంపైర్‌ జోయెల్‌ విల్సన్‌ రోహిత్‌ శర్మను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న హిట్‌మ్యాన్‌ వెంటనే రివ్యూకు వెళ్లగా ఫలితం అనుకూలంగా వచ్చింది. బంతి బ్యాట్‌ను తాకలేదని రీప్లేలో  స్పష్టంగా తేలడంతో థర్డ్‌ అంపైర్‌ రోహిత్‌ శర్మను నాటౌట్‌గా ప్రకటించాడు.

ధర్మశాల వేదికగా గురువారం నాటి తొలి రోజు ఆటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఫీల్డ్‌ అంపైర్‌ తనను అవుట్‌గా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నట్లుగా రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌ అవుతోంది. ఇందులో రోహిత్‌ ప్రదర్శించిన హావభావాలకు నెటిజన్లు తమదైన శైలిలో భాష్యాలు చెబుతున్నారు. 

‘‘అదెట్లా అవుట్‌ అంపైర్‌ జీ.. కానేకాదు! ముందే చెప్పానుగా!.. అన్నట్లు హిట్‌మ్యాన్‌ నవ్వుతూనే.. సెటైరికల్‌గా ఓ చూపు చూశాడు. నిజంగా రోహిత్‌ సూపర్‌ కదా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్‌ శర్మ శతకం(103) పూర్తి చేసుకున్నాడు. అతడికి టెస్టుల్లో ఇది 12వది కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 48వది. 

చదవండి: స్టోక్స్‌ ‘మ్యాజిక్‌’ బాల్‌.. రోహిత్‌ క్లీన్‌బౌల్డ్‌!.. ఇంగ్లండ్‌ బౌలర్‌ రియాక్షన్‌ వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)